Share News

బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:28 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లాకు కొత్త వచ్చిన ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ శనివారం రాత్రి బాధ్యత లు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ
నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తున్న సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లాకు కొత్త వచ్చిన ఎస్పీ డాక్టర్‌ సంగ్రామ్‌సింగ్‌ జీ పాటిల్‌ శనివారం రాత్రి బాధ్యత లు స్వీకరించారు. సీఐడీ డిపార్ట్‌మెంట్‌లో సూపరిం టెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్ర భుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విష యం తెలిసిందే. ఈ క్రమంలో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన ఆయనను బదిలీపై వెళ్తు న్న గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ పుష్పగుచ్ఛం అందిం చి స్వాగతం పలికారు. ఇక్కడ విధులు నిర్వహించి న ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ టాస్క్‌ఫోర్సు డిప్యూటీ కమిషనర్‌గా బదిలీపై వెళ్లిన ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:28 PM