Share News

ఠాణాలను తనిఖీ చేసిన ఎస్పీ

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:26 PM

నా గర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూ ర్‌ సర్కిల్‌ పరిధిలో ని పోలీస్‌ స్టేషన్లను జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సిం గ్‌జీ పాటిల్‌ తనిఖీ చేశారు.

ఠాణాలను తనిఖీ చేసిన ఎస్పీ
పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌

కొల్లాపూర్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): నా గర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూ ర్‌ సర్కిల్‌ పరిధిలో ని పోలీస్‌ స్టేషన్లను జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సిం గ్‌జీ పాటిల్‌ తనిఖీ చేశారు. ఇటీవల నాగర్‌క ర్నూల్‌ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం సాయంత్రం కొల్లాపూర్‌ స ర్కిల్‌ పరిధిలోని పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొ ల్లాపూర్‌, కోడేరు ఠాణాలను తనిఖీ చే శారు. వాటి పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎన్నికల సరళి ఏ విధంగా ఉంది? నామినేషన్‌ క్లస్టర్ల వద్ద బం దోబస్తు ఏర్పాట్లు, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రా లు ఎన్ని ఉన్నాయో సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు. అదే విధంగా రౌడీ షీటర్ల వివరాలను తెలుసు కుని, వారి కార్యకలాపాల పై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని సంబంధిత అధి కారులకు ఆదేశించారు. గ్రా మస్థాయిలో పని చేస్తున్న విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ త మ తమ గ్రామాల్లో ఎల్ల ప్పుడు అందుబాటులో ఉం డి ప్రజల సమస్యలను పరి ష్కరించేందుకు కృషి చే యాలని తెలిపారు. నేర నిరోధక చర్యల్లో భా గంగా ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కు చురుకుగా ముందుకు రావాలని ఆదేశించా రు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిశుభ్రత, రికా ర్డుల నిర్వహణ, సిబ్బంది క్రమశిక్షణ పట్ల సం తృప్తి వ్యక్తం చేశారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్‌ వ్యవస్థ మరింత బలోపే తం కావాలని ఆకాంక్షించారు.

Updated Date - Dec 03 , 2025 | 11:26 PM