ప్రయాణికురాలిగా ఎస్పీ
ABN , Publish Date - Nov 21 , 2025 | 11:26 PM
జిల్లా పోలీస్ బాస్(ఎస్పీ) జానకి.. సాధారణ ప్రయాణికురాలిగా సివిల్ డ్రెస్‌లో శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ బస్టాండ్ అంతా కలియ తిరిగారు. కళాశాల వదిలిన సమయానికి అక్కడికి వెళ్ళిన ఆమె బాలికలు, మహిళలను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తున్నారా? ఈవ్ టీజింగ్ చేస్తున్నారా? అని పరిశీలించారు.
సివిల్ డ్రెస్‌లో బస్టాండ్‌కు..
బాలికల భద్రత, ఆకతాయిల వేధింపులపై ఆరా తీసిన జానకి
మహబూబ్‌నగర్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా పోలీస్ బాస్(ఎస్పీ) జానకి.. సాధారణ ప్రయాణికురాలిగా సివిల్ డ్రెస్‌లో శుక్రవారం సాయంత్రం మహబూబ్‌నగర్ బస్టాండ్ అంతా కలియ తిరిగారు. కళాశాల వదిలిన సమయానికి అక్కడికి వెళ్ళిన ఆమె బాలికలు, మహిళలను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తున్నారా? ఈవ్ టీజింగ్ చేస్తున్నారా? అని పరిశీలించారు. ఆ తరువాత వారి వద్దకెళ్లి మీకేమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజా భద్రత-పోలీసు బాధ్యత కార్యక్రమంలో భాగంగా బస్టాండ్‌కు వచ్చారు. అనంతరం వారి వద్దకు వెళ్ళి తాను ఎస్పీనని పరిచయం చేసుకొని వారితో మాట్లాడారు. అభద్రతగా అనిపిస్తే 100, షీటీమ్ నెంబర్ 8712659365 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. బాలికలతో షీ టీమ్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నివాసులు, సురక్ష కళా బృందం సభ్యులు పాల్గొన్నారు.