Share News

దక్షిణాఫ్రికా అతిథులొచ్చారు..

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:22 PM

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం కాచ్‌వార్‌కు అతిథులొచ్చారు. గ్రామంలోని చెరువులో నల్ల, సగం నలుపు.. సగం తెలుపు రంగు కొంగలు కనిపించాయి. నీటిలోని క్రిమి కీటకాలను తింటూ సందడి చేశాయి.

దక్షిణాఫ్రికా అతిథులొచ్చారు..
క్యాచ్‌వార్‌ చెరువులో సందడి చేస్తున్న కొంగలు

నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం కాచ్‌వార్‌కు అతిథులొచ్చారు. గ్రామంలోని చెరువులో నల్ల, సగం నలుపు.. సగం తెలుపు రంగు కొంగలు కనిపించాయి. నీటిలోని క్రిమి కీటకాలను తింటూ సందడి చేశాయి. దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఉండే ఈ నల్ల కొంగలు ఈ ప్రాంతానికి ఏటా శీతాకాలంలో వచ్చి వెళ్తుంటాయని నారాయణపేట అటవీశాఖ రేంజ్‌ అధికారి కమాలొద్దీన్‌ తెలిపారు. ఇవి ఇక్కడే ఉండేలా అటవీ శాఖ పరంగా అవసరమైన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

- నారాయణపేట, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Dec 06 , 2025 | 11:22 PM