తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:43 PM
కాం గ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ కృషి వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంద ని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మె ల్యే సంపత్‌కుమార్ అన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్
వడ్డేపల్లి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాం గ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ కృషి వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంద ని ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మె ల్యే సంపత్‌కుమార్ అన్నారు. ఎన్నో ఏళ్ల తెలం గాణ ప్రజల ఆకాంక్షను నేరవేర్చిన గొప్ప నాయ కురాలిగా ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారన్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకను కాంగ్రెస్ పార్టీ ఆధ్వ ర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతినగర్‌లోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో సంపత్‌కుమార్ కేక్ కట్ చేశా రు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పర స్పరం మిఠాయిలు తినిపించుకుని సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.