తల్లిని గొంతు నులిమి చంపిన కొడుకు
ABN , Publish Date - Sep 13 , 2025 | 11:09 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్ర మునిసిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామానికి చెందిన దాసరి అలివేలు(50)ను కొడుకు శివ, కోడలు పద్మ గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్ శనివారం తెలి పారు.
నాగర్‌కర్నూల్ క్రైం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్ర మునిసిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామానికి చెందిన దాసరి అలివేలు(50)ను కొడుకు శివ, కోడలు పద్మ గొంతు నులిమి హత్య చేసినట్లు ఎస్‌ఐ గోవర్ధన్ శనివారం తెలి పారు. ఎండబెట్లకు చెందిన అలివేలు తన కొడుకు శివ జులాయిగా తిరుగుతు న్నాడని మందలించింది. దీంతో ఆగ్రహించిన కొడుకు శివ అతని భార్య పద్మ శుక్రవారం రాత్రి తల్లి ఇంట్లో నిద్రించిన తర్వాత గొంతు నులిమి హత్య చేశా రు. శనివారం ఉదయం తన అక్క ఓట్స్ మనెమ్మకు తల్లి చనిపోయిందని ఫో న్ ద్వారా సమాచారమిచ్చాడు. దీంతో మనెమ్మ వచ్చి తన తల్లిని హత్య చేశా రనే అనుమానంతో నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది. ఈ విషయం తెలుసుకున్న కొడుకు శివ, కోడలు పద్మలు పరారయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపారు.