భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం
ABN , Publish Date - Apr 17 , 2025 | 11:18 PM
భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ సంతోష్ అన్నారు.
సమగ్ర వివరాలతో త్వరలో భూధార్
అవగాహన కార్యక్రమంలో కలెక్టర్
గద్వాల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం వ్యవసా య మార్కెట్‌లో భూభారతి, నూతన ఆర్‌వోఆర్ చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ప్రజలకు ఎలాంటి భూ వివాదాలకు తావులేకుండా భూములపై పూర్తి యాజమాన్య హ క్కులు కల్పించేందుకు ప్రభుత్వం నూతన ఆర్‌వోఆర్ చట్టం తీసుకువచ్చిందని అన్నారు. ఇందులో 23సెక్షన్‌లు, 18నిబంధనలు ఉన్నాయ ని, ధరణి స్థానంలో భూభారతి తెచ్చారని తెలి పారు. దీనివల్ల రైతుల భూ సమస్యలు త్వరంగా పరిష్కారం అవుతాయని వివరించారు. ఆధార్ తరహాలో త్వరలో భూమికి సంబందించి సర్వేచేసి కొలతలు, హద్దుల వంటి సమగ్ర వివరాల తో భూధార్ రాబోతుందన్నారు. ఈచట్టం ద్వారా భూముల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకా శం కల్పించారని తెలిపారు. భూమి రిజిస్ర్టేషన్, మ్యుటేషన్‌కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాపు తయారు చేయాల్సి ఉం టుందని వివరించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సాదాబైనామాల పరిష్కారం ఈ చట్టం ద్వారా వేగవంతమవుతుందన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్ధమైన మార్గం కల్పిస్తున్నదన్నారు. మే 1నుంచి గ్రామ పాలన అధికారుల నియామకంతో భూ సమస్యలు సులభతరం అ వుతుందని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ అధికారుల ద్వారా రైతు వేదికల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్మన్ ఎంఏ సుభాన్, తహసీల్దార్ మల్లికార్జున్, మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ రైతులు పాల్గొన్నారు.