ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Mar 16 , 2025 | 11:03 PM
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి విద్యారంగం పటిష్టతకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్టీయూటీఎస్ జి ల్లా అధ్యక్షుడు ఎండీ యూనిస్ పాషా కోరారు.

ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు యూనిస్ పాషా
గద్వాల టౌన్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి విద్యారంగం పటిష్టతకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్టీయూటీఎస్ జి ల్లా అధ్యక్షుడు ఎండీ యూనిస్ పాషా కోరారు. ప్రతి ఏటా పదోన్నతులు కల్పించడం, ఖాళీలను భర్తీ చేయడం, మౌలిక వసతులను మెరుగు ప రచడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. యూనియన్ జిల్లా శాఖ తొలి కార్యవర్గ సమావేశం ఆదివారం పట్టణం లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు.సమావేశంలో మాట్లాడిన ఎండీ యూనిస్ పాషా, జీపీఎఫ్, మెడికల్, సరండర్ లీవ్‌ల వంటి పలుపెండింగ్ బిల్లులను, డీఏలను సత్వరమే మంజూరు చేయాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు రావాల్సిన అన్నిరకాల బెనిఫిట్స్‌ను అందజేసి వారికి ఉపశ మనం కల్పించాలన్నారు. జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి పులిపాటి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు పెంచాలన్నారు. సమా వేశంలో రాష్ట్ర కార్యదర్శి చెన్నకేశవులు, సాంస్కృ తిక విభాగం రాష్ట్ర కన్వీనర్ గౌరీశంకర్, నాయ కులు కృష్ణయ్య, కిశోర్‌చంద్ర, విజయభాస్కర్, శ్రీహరి, శంకర్‌నాయక్, వెంకటేశ్వర్లు, రవికుమా ర్, జగదీశ్వర్, ఆచారితో పాటు అన్నిమండలాల అధ్యక్ష, కార్యదర్శులు ఉన్నారు.