Share News

ఘనంగా విగ్రహాల ఊరేగింపు

ABN , Publish Date - Jun 06 , 2025 | 10:51 PM

మక్తల్‌ పట్టణంలోని యాదవనగర్‌లో వెలసిన వేణు గోపాలస్వామి దేవాలయంలో శ్రీకృష్ణుడు, ఇతర విగ్రహాల ఊరేగింపు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.

ఘనంగా విగ్రహాల ఊరేగింపు
విగ్రహాల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, భక్తులు

మక్తల్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): మక్తల్‌ పట్టణంలోని యాదవనగర్‌లో వెలసిన వేణు గోపాలస్వామి దేవాలయంలో శ్రీకృష్ణుడు, ఇతర విగ్రహాల ఊరేగింపు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు పడమటి ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ఆజాద్‌నగర్‌, రాఘవేంద్ర థియేటర్‌, బ్రాహ్మణ వాడి, పాత కూరగాయల మార్కెట్‌ మీదుగా ఊరేగింపు సాగింది. ఊరేగింపులో భక్తులు కోలాటం, భజనలు చేశారు. అనంతరం వేణుగోపాలస్వామి ఆలయంలో గోపూజ, ధ్వజారోహణం, అఖండ దీపారాధన, దేవతల స్థాపన, మహా గణపతి యాగం, సాయంత్రం వేద పారాయణం, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత అన్నదాన కార్యక్ర మం కొనసాగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వా కిటి శ్రీహరి, ఆలయ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీరాములు, రఘుప్రసన్నభట్‌, కట్టసురేష్‌కుమార్‌, బీ ఆర్‌ఎస్‌ నాయకుడు రాజుల ఆశిరెడ్డి, బీజేపీ నాయకులు కర్నిస్వామి, బాల్చెడ్‌ మల్లికార్జున్‌, కల్లూరి నాగప్ప, కావలి శ్రీహరి, కర్ని గోవర్దన్‌, తిరుపతి నర్సిములు, మామిళ్ల కిష్టప్ప, వాకిటి నర్సింహ, రేణుకనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 10:51 PM