ఘనంగా శిఖర కలశ ప్రతిష్ఠాపన
ABN , Publish Date - May 18 , 2025 | 11:19 PM
పట్టణంలోని జాతీయరహదారి పక్కన ఉన్న బంగారుమైసమ్మ ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆదివారం ఘనం గా నిర్వహించారు.
జడ్చర్ల, మే 18 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని జాతీయరహదారి పక్కన ఉన్న బంగారుమైసమ్మ ఆలయ శిఖర కలశ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ఆదివారం ఘనం గా నిర్వహించారు. అమ్మవారికి ప్రాతఃకాలపూజలు, అభిషేకాలు, సామూహిక కుంకుమార్చన చేప ట్టారు. పూజలలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, కౌన్సిలర్లు బుక్కమహేశ్, జ్యోతి, సతీష్, కోడ్గల్‌యాదయ్య, రఘుపతిరెడ్డి, గోనెల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.