ఘనంగా గ్రామ దేవతల విగ్రహాలు, బొడ్రాళ్లు, లింగమయ్య ప్రతిష్ఠాపన
ABN , Publish Date - Jun 05 , 2025 | 11:33 PM
ఆత్మకూరు పట్టణంలో మూడు రోజులుగా కొన సాగుతున్న గ్రామ దేవతలు, లింగమయ్య, బొడ్రాళ్ల ప్రతిష్ఠాపన కార్యక్రమం గు రువారం ఘనంగా ముగిసింది.
- బొడ్రాళ్లు, లింగమయ్య వద్ద పూజలు చేసిన భక్తులు
- ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ఆత్మకూరు, జూన్ 5(ఆంధ్రజ్యోతి) : ఆత్మకూరు పట్టణంలో మూడు రోజులుగా కొన సాగుతున్న గ్రామ దేవతలు, లింగమయ్య, బొడ్రాళ్ల ప్రతిష్ఠాపన కార్యక్రమం గు రువారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భం గా ఉదయం 7:56 గంటలకు పోచమ్మ, కర్రె మ్మ, కట్ట మైసమ్మ, కోట మైసమ్మ, భూ లక్ష్మ మ్మ గ్రామ దేవతలు అలాగే ఐదు బొడ్రాళ్లు, నాలుగు గండ జ్యోతి దీప స్తంభాలు ప్రతిషా ్ఠపన ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో వేద పండితుల సమ క్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హించిన అనంతరం ఆయా గ్రామ దేవత ల ఆలయాల్లో విగ్ర హాలను గ్రామ పెద్ద లు ఆలయ కమిటీ స భ్యులు, భక్తులు ప్రతి ష్ఠించారు. ఈ సంద ర్భంగా గ్రామ దేవత ల ఆలయాల్లో మండ లంలోని ఆయా గ్రామా ల ప్రజలతో పాటు ప ట్టణ భక్తులు వేలాదిగా తరలి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రె డ్డి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. మూడు రోజుల పాటు నిర్వహిం చిన అమ్మ వారి ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో ఆయా గ్రామాల నుంచి ఆడబిడ్డలు, మహి ళలు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మ వార్ల కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయాల నిర్మాణ కమిటీ పెద్దలు మొగిలి శ్రీధర్ గౌడ్, ఘాడి కృష్ణమూర్తి, గాడి లక్ష్మి నారాయణ, మనివర్ధన్ రెడ్డి, రవికుమార్ యాదవ్, శివానంద్, నగేష్, ఎస్ టీడీ శ్రీనివా సులు, కోట్ల వెంకటేష్, యాదగిరి, అశ్విన్ కు మార్, బాలకృష్ణ, రాము, చందు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.