Share News

ఘనంగా గణనాథుల నిమజ్జనం

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:14 PM

మక్తల్‌ పట్టణంలో ఆదివారం గణేశ్‌ ని మజ్జన ఊరేగింపు వేడుకలు కోలా హలంగా నిర్వహించారు. వీహెచ్‌ పీ, బజరంగదళ్‌ ఆధ్వర్యంలో ఆ జాద్‌నగర్‌ చౌరస్తాలో స్వాగత వేదికను మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత ప్రారం భించారు.

 ఘనంగా గణనాథుల నిమజ్జనం
ఆజాద్‌ ఉత్సవ కమిటీకి మెమొంటో అందిస్తున్న వీహెచ్‌పీ, బజరంగాదళ్‌ నాయకులు

మక్తల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : మక్తల్‌ పట్టణంలో ఆదివారం గణేశ్‌ ని మజ్జన ఊరేగింపు వేడుకలు కోలా హలంగా నిర్వహించారు. వీహెచ్‌ పీ, బజరంగదళ్‌ ఆధ్వర్యంలో ఆ జాద్‌నగర్‌ చౌరస్తాలో స్వాగత వేదికను మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత ప్రారం భించారు. స్వాగత వేదిక వద్ద బా లగంగాధర్‌ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన ఉత్సవా లు ప్రారంభించారు. వివిధ గణేశ్‌ ఉత్సవ కమిటీలకు వీహెచ్‌పీ, బజరంగదళ్‌ నాయకులు గణేశ్‌ ఉత్సవ కమిటీ నాయకులకు మెమొంటో లు అందించారు. పట్టణంలోని శబరికాలనీ, న్యూమారుతినగర్‌, రాఘవేంద్ర కాలనీ, రాంలీలా మైదానం, ఉమామహేశ్వరాలయం, కుమ్మరి వా డ, నేతాజీనగర్‌, వాకిటి గేరి, బ్రాహ్మణవాడ, రజకవాడ, అంబేడ్కర్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను నిమజ్జనానికి తర లించారు. వివిధ గణనాథులను ప్రత్యేకంగా అ లంకరించి ముస్తాబు చేశారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వ రకు నిమజ్జన ఊరేగింపు కొ నసాగింది. బీకేఆర్‌ ఫౌం డేషన్‌ అధినేత బాలక్రి ష్ణారెడ్డి భక్తులకు, గణే ష్‌ ఉత్సవ కమిటీ సభ్యులకు పులిహోర, మంచినీరు అందించారు. నిమజ్జన ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహించేందుకు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. 130మంది పోలీస్‌ సిబ్బందితో సీఐ రాంలాల్‌, ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డిలు గట్టి బం దోబస్తు ఏర్పాటు చేశారు. వీహెచ్‌పీ, బజరంగ దళ్‌, హిందూ ధార్మిక సంఘాలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 11:15 PM