Share News

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:27 PM

బెంగళూరులో వనపర్తి జి ల్లా అమరచింతకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

- అమరచింతలో విషాదఛాయలు

అమరచింత, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): బెంగళూరులో వనపర్తి జి ల్లా అమరచింతకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మం డల కేంద్రానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యా యుడు చంద్రశేఖర్‌ పెద్ద కుమారుడు శరత్‌ (28) మూడేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఓ ప్రైవేటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. తోటి ఉద్యోగులతో కలిసి వర్తూరు ప్రాం తంలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి భోజనం అ నంతరం బయటికి వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని ఓ వాహనం యు వకుడికి ఢీకొట్టడంతో తలకు, కాళ్లకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టుపక్కల వారు మృతునికి అక్కడి నుంచి తరలిం చారు. బయటికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన స్నేహితుడు తిరిగి రాకపో వడంతో తోటి ఉద్యోగులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అ మరచింత నుంచి తల్లిదండ్రులు, బంధువులు రెండు రోజుల క్రితమే బెం గళూరు వెళ్లి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తమ కుమారుడు కనబడడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రెండు రోజులుగా విచారణ చేయగా ఆ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆరా తీయగా మార్చురీలో ఉ న్న మృతదేహాన్ని శరత్‌గా నిర్ధారించారు. శనివారం పోస్టుమార్టం అనం తరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడంతో అమరచింతకు తీ సుకొస్తున్నారు. మృతుడికి తల్లిదండ్రులతో పాటు చెల్లి, సోదరుడు ఉన్నా రు. శరత్‌ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated Date - Dec 13 , 2025 | 11:27 PM