సమసమాజ దార్శనికుడు బాబు జగ్జీవన్‌రామ్
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:12 PM
సమ సమాజ దార్శనికుడు బాబు జగ్జీవన్‌రామ్ అని, ఆయన జీవితాన్ని ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేటటౌన్, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): సమ సమాజ దార్శనికుడు బాబు జగ్జీవన్‌రామ్ అని, ఆయన జీవితాన్ని ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ 118వ జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు, ఎస్పీ యోగేష్‌గౌతమ్‌లు హాజరై బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడుగా జగ్జీవన్‌రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని కొనియాడారు. చిన్ననాటి నుంచే వివక్షను ఎదు ర్కొన్న ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని, దేశ స్వయం పాలనలో కేబినెట్ మంత్రిగా కార్మిక శాఖలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారని కితాబునిచ్చారు. దేశ రక్షణ, వ్యవసాయం, టెలీ కమ్యూనికేషన్స్ శాఖలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అఽధికారి ఉమాపతి, డీఎస్పీ నల్లపు లింగయ్య, డీఆర్డీఏ మొగులప్ప, డీపీఆర్‌వో ఎంఏ.రషీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, ఏవో జాన్ సుధాకర్, మహేష్, శరణప్ప, రమేష్ తదితరులున్నారు.