Share News

సరిహద్దులో అక్రమ రవాణాను అరికట్టాలి

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:47 PM

తెలంగాణ - కర్ణాటక సరిహద్దులో కేటీదొడ్డి పో లీస్‌ స్టేషన్‌ ఉన్నందున ఎలాంటి అక్రమ రవా ణా జరగకుండా చెక్‌పోస్ట్‌ల దగ్గర పటిష్ట నిఘా ఉండాలని జోగుళాంబ గద్వాల ఎస్పీ టి.శ్రీనివా సరావు అన్నారు.

సరిహద్దులో అక్రమ రవాణాను అరికట్టాలి
ఎస్సై, సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ శ్రీనివాసరావు

  • కేటీదొడ్డి పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

కేటీదొడ్డి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ - కర్ణాటక సరిహద్దులో కేటీదొడ్డి పో లీస్‌ స్టేషన్‌ ఉన్నందున ఎలాంటి అక్రమ రవా ణా జరగకుండా చెక్‌పోస్ట్‌ల దగ్గర పటిష్ట నిఘా ఉండాలని జోగుళాంబ గద్వాల ఎస్పీ టి.శ్రీనివా సరావు అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం మండలంలోని కేటీదొడ్డి పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఫిర్యాదు దారుల నుంచి వచ్చే పాజిటివ్‌ స్పందననే పో లీసుల పనితీరును తెలియజేస్తుందని ఆ దిశగా అధికారులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వ హించాలన్నారు. గ్రామాల్లో వీపీవో అధికారులు రౌడీ షీటర్స్‌, సస్పెక్ట్‌లపై నిఘా ఉంచడంతో పాటు గ్రామాల్లో ఎలాంటి సమా చారమైనా తెలుసుకొని ఉండాలని సూచించారు. అలాగే స్టేషన్‌ రికార్డులను, స్టేషన్‌ పరిసరాలను తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఉన్న స్వాధీ నం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్‌ సిబ్బంది స్టేషన్‌కు వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా మా ట్లాడాలని తెలిపారు. అలాగే నేరాలను చేధించ డంలో ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్య తను ప్రజలకు వివరిస్తూ ప్రజలే స్వచ్ఛందం గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధం గా అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరో జు వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ట్రాఫిక్‌ ని యమాలు పాటించని వాహనాదారులపై చర్య లు తీసుకోవాలని, అనుమానిత వాహనాలను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ మొగలయ్య, గద్వాల సీఐ టీ. శ్రీను, స్థానిక ఎస్సై శ్రీనివాసులు పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:47 PM