ధూమపానంతో ఆరోగ్యం నాశనం
ABN , Publish Date - May 31 , 2025 | 11:10 PM
ధూమపానం అలవాటు కాదని, అది ఆరోగ్యాన్ని నాశనం చేసే ఒక మానసిక, శారీరక బానిసత్వ మని సైకియాట్రిస్ట్ ప్రదీప్‌కుమార్ అన్నారు.
- సైకియాట్రిస్ట్ ప్రదీప్‌కుమార్
గద్వాల న్యూటౌన్, మే 31 (ఆంధ్రజ్యోతి): ధూమపానం అలవాటు కాదని, అది ఆరోగ్యాన్ని నాశనం చేసే ఒక మానసిక, శారీరక బానిసత్వ మని సైకియాట్రిస్ట్ ప్రదీప్‌కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత డీఎంహెచ్ వో కార్యాలయ ఆవరణలో పొగాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఆయన మాట్లాడుతూ.. సిగరెట్, గుట్కా, బీడీ వంటి పదార్ధాల్లో నికోటిన్, టార్లాం టి విషపదార్ధాలు ఉంటాయన్నారు. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్, హార్ట్‌ఎటాక్, స్ట్రోక్, నోటిక్యాన్సర్ ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ సమన్వయ కార్యకర్త శ్యాంసుందర్, ఎంసీహెచ్ సెంటర్ సూపర్‌వైజర్ సుబ్బలక్ష్మి, సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.
పొగాకు సేవనం మరణశాసనమే
గద్వాల టౌన్: పొగాకు సేవనం తనకుతా నుగా రాసుకునే మరణశాసనం వంటిదని గ ద్వాల బ్రహ్మకుమారి కేంద్రం ఇన్‌చార్జి మంజుల అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్స వాన్ని పురస్కరించుకుని బ్రహ్మకుమారీస్ ఆధ్వ ర్యంలో రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మెడికల్ వింగ్ విభాగం తరఫున శని వారం పట్టణంలోని రైల్వేస్టేషన్, పాతబస్టాండ్ సర్కిల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. పొగ తాగడంతో ప్రపంచ వ్యాప్తంగా రో జుకు సగటున 3,500 మంది మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతుండటం ఆందోళనకరమన్నా రు. రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన కార్య క్ర మంలో రైల్వే ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ మహ్మద్ అస దుల్లా, పాతబస్టాండ్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ దశరథ్‌లు మాట్లాడుతూ పొగాకు సేవనంతో ఎదురయ్యే అనారోగ్యం, ప్రాణాంతక సమస్యల గురించి వివరించారు.
ధూమపానం ప్రాణాంతకం
గద్వాల సర్కిల్: ధూమపాన అలవాటు వ్యక్తి కి అత్యంత ప్రాణాంతకమని అదనపు సీనియర్ సివిల్ న్యాయాధికారి టీ.లక్ష్మి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులో శనివారం జిల్లా న్యా య సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిం చిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి న్యాయాధికారి హాజరై మాట్లాడారు. ఆరోగ్య విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. అనంతరం ప్రజలచేత నిషేధ ధ్రుడ సంకల్ప ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యా యాధికారి ఎన్‌వీహెచ్ పూజిత, న్యాయవాదులు, గ్రామస్థులు పాల్గొన్నారు.