శ్రీశైలం డ్యాంలోకి స్వల్పంగా వరద
ABN , Publish Date - May 24 , 2025 | 11:03 PM
కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వారం రోజులుగా స్వల్పంగా వరద వస్తోంది.

- వారం రోజుల్లో 4 టీఎంసీల నీరు
- 39 టీఎంసీల నీటి నిల్వలు
- ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో కొనసాగున్న విద్యుత్ ఉత్పత్తి
దోమలపెంట, మే 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతం నుంచి వారం రోజులుగా స్వల్పంగా వరద వస్తోంది. సుంకేసుల నుంచి 6,560 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి చేరుతుండటంతో శనివారం శ్రీశైం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడగులకు గాను 818.00 అడుగులకు చేరిం ది. 215.8070 టీఎంసీల గాను, 39.3750 టీ ఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు డ్యాం గేజింగ్ అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో 5,824 క్యూ సెక్కుల నీటిని ఉపయోగించి 2.890 మిలియ న్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కాగా కృష్ణానదికి అనుసంధానంగా ఉన్న కాలువకు ఎంజీకేఎల్‌ఐ కాల్వ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని తెలంగాణ వైపు మళ్లిస్తున్నట్లు డ్యాం అధికారులు తెలిపారు. కృష్ణా నదికి ఎగువ పరివాహక ప్రాతంలో ఈ ఏడాది వర్షాలు కురుస్తుండటంతో గతేడాది కంటే ముందు గానే ప్రాజెక్టుల్లోకి వరద చేరే అవకాశం ఉన్న ట్లు డ్యాం అధికారులు తెలిపారు.