సారు.. మా సమస్య పరిష్కరించండి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:20 PM
సారు.. మా తండాకు వెళ్లాలంటే నరక యాతన అనుభవిస్తున్నాం.
- కరిగెటను తలపిస్తున్న బోట్లగడ్డతండా రోడ్డు
మహమ్మదాబాద్ సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) :సారు.. మా తండాకు వెళ్లాలంటే నరక యాతన అనుభవిస్తున్నాం.. కనీసం మా గోడు పట్టించుకునే నాఽథుడే లేడని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఆముదాలగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న బోట్లగడ్డ తండా నుంచి ప్రధాన రహదారికి రావాలంటే రెండు కిలో మీటర్ల దారి ఇటీవల కురిసన వర్షాలకు కరిగెటను తలపిస్తోంది. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీల నాయకులు తాము అధికారంలోకి వస్తే తండాకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చినా.. తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తండా మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్నా.. వికారాబాద్ కుల్కచర్ల మండలం పుట్టాపహడ్ నుంచి కుసుమ సముద్రం వెళ్లే బీటీ రోడ్డు నుంచి మధ్యలో రెండు కిలో మీటర్లు మట్టిరోడ్డు ద్వారా తండాకు వెళ్లాలి. కాగా ఇప్పటికైనా అధికారులు స్పందించి బీటీ రోడ్డు వేయాలని తండావాసులు కోరుతున్నారు.