Share News

వందేమాతరం గీతం ఆలాపన

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:18 PM

వందేమాతరం గీతం ఆవిర్భవించి 150 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం గీతాలాపన నిర్వ హించారు.

వందేమాతరం గీతం ఆలాపన
జడ్చర్ల పట్టణంలో ర్యాలీ నిర్వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌సీసీ విద్యార్థులు

మహబూబ్‌నగర్‌టౌన్‌/రూరల్‌/మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం/హన్వాడ/దేవరకద్ర/ మిడ్జిల్‌/నవాబ్‌పేట/భూత్పూర్‌/ కోయిలకొండ /రాజాపూర్‌/జడ్చర్ల నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : వందేమాతరం గీతం ఆవిర్భవించి 150 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో శుక్రవారం వందేమాతరం గీతాలాపన నిర్వ హించారు. సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ప్రధాన కా ర్యదర్శి నస్కంటి నాగభూషణం ఆధ్వర్యంలో సీ నియర్‌ సిటిజన్‌ ఫోరం కార్యాలయంలో భరత మాత చిత్రపటానికి పూజలు నిర్వహించి, వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఉపాధ్యక్షుడు రాజసింహుడు కోటిరెడ్డి, రాములు, మనోహర్‌రా వు, లక్ష్మయ్య, ఈశ్వరయ్య, బుచ్చన్న, రవిపాల్‌ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండ లం కోడూర్‌, ధర్మాపూర్‌, మణికొండ, గాజుల పేట, ఫతేపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో వందేమాతరం గీతం ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. హ న్వాడ మండలంలోని అన్ని పాఠశాలలతో పాటు తహసీల్దార్‌, ఆసుపత్రి, మండల కార్యాలయాల్లో శుక్రవారం వందేమాతరం గేయాన్ని ఆలపించా రు. దేవరకద్ర మండల కేంద్రంలోని తహసీల్దార్‌, ఎంపీడీవో, మునిసిపల్‌ కార్యాలయాల్లో ఎం పీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ దీపిక, కమిష నర్‌ నరేష్‌బాబు వందేమాతం గీతాలాపన చేశారు. మిడ్జిల్‌ మండల కేంద్రంలోని గీతాలాపన వేడుకల్లో తహసీల్దార్‌ రాజు, ఎంపీడీవో గీతాంజాలి, ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు వెంకటయ్య, మల్లికార్జున్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, శివ పాల్గొన్నారు. బంకిన్‌ చంద్ర చటార్జి రచించిన వందేమాతరం గేయం మరువలేనిదని మార్కెట్‌ చైర్మన్‌ హరలింగం అన్నారు. శుక్రవారం నవాబ్‌పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించి దేశ ఐక్యతను చాటారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో జయరాములు, ఏవో కృష్ణ కిషోర్‌, మార్కెటింగ్‌ కార్యదర్శి రమే ష్‌కుమార్‌, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం సభ్యులు నర్సింహులు, వెంకటేఽశ్వరప్ప జాతీయ గీతాన్ని ఆలపించారు. భూత్పూర్‌ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో ఉమాదేవి ఆధ్వర్యంలో, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కిషన్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉదయం 10 గంటలకు వారివారి కార్యాలయాల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. సీఐ కార్యాలయంలో సీఐ రామకృష్ణ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ చంద్రశేఖర్‌ వందేమాతరం గీతాన్ని ఆలపించారు. సింగిల్‌ విండో కార్యదర్శి రత్నయ్య పాల్గొన్నారు. కోయిలకొండ మండల కేంద్రంతో పాటు రాజాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేజీబీవీ, ప్రభుత్వ కార్యలయాల్లో వందేమాతరం గీతాలాపన చేశారు. జడ్చర్ల పట్టణంలోని తహసీల్దార్‌, మండల ప్రజా పరిషత్‌, మునిసిపల్‌ కార్యాలయం, ప్రభుత్వ పాఠశా లలు, కళాశాలలతో పాటు ప్రైవేట్‌ కార్యాలయాల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని ఎన్‌సీసీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ వద్ద పాలకవర్గం సభ్యులు వందేమాతరం గీతం ఆలపించారు.

Updated Date - Nov 07 , 2025 | 11:18 PM