హెచ్‌సీఏ టోర్నీలో ప్రతిభ చాటాలి
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:47 PM
హెచ్‌సీఏ టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని క్రికెట్ సంఘం జిల్లా ప్రధాన కార్యద ర్శి రాజశేఖర్ అన్నారు.
- క్రికెట్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
- హెచ్‌సీఏ టోర్నీకి తరలిన ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): హెచ్‌సీఏ టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని క్రికెట్ సంఘం జిల్లా ప్రధాన కార్యద ర్శి రాజశేఖర్ అన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్-14 ఇంట ర్ స్కూల్ లీగ్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా అండర్-14 బాలుర జట్టు తర లివెళ్లింది. సోమవారం బోయపల్లి సమీపంలో గల ఎండీసీఏ మైదానంలో ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో జట్టు క్రీడాకారులను అభినందించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దే శంతో హెచ్‌సీఏ కృషి చేస్తున్నాదని తెలిపారు. లీగ్‌లో ఉమ్మడి జిల్లా క్రీడాకారు లు జట్టు విజయానికి కృషి చేయాలని, రాష్ట్ర జట్టుకు ఎంపిక కావాలని ఆకాం క్షించారు. ఎంపికల్లో 39 మంది క్రీడాకారులను ఎంపిక చేసి, మూడు జట్లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించామని తెలిపారు. ప్రతిభ చాటిన క్రీడాకారుల ను తుది జట్టుకు ఎంపిక చేశామని చెప్పారు. సురేష్‌కుమార్ పాల్గొన్నారు.
జట్టు వివరాలు: రాహుల్‌రైనా, అర్హన్, జైద్, శ్రీహర్షిత్, రాఘవ, పుణిత్, వెంకట్‌సాయి, కార్తీకేయ, సాయిరామ్, జోసెఫ్, హృతిక్, చరణ్‌తేజ, సాత్విక్, సోహెల్, దానుష్, కోచ్ ముఖ్తర్‌అలీ.