యూరియాలో ఇసుక కలుపాలా..
ABN , Publish Date - Sep 03 , 2025 | 10:54 PM
యూరియా లేక రైతులు నష్టపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాజీమంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ హెచ్చరించారు. రైతులు ఆందోళనలు చేస్తుంటే యూరియా సరఫరా చేయడంపై దృష్టి సారించకుండా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇసుకలో యూరియా కలుపుకుని చల్లాలని అవగాహన లేకుండా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
అన్నంలో ఇసుక కలుపుకొని తింటారా?
మంత్రి తుమ్మలను ప్రశ్నించిన మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): యూరియా లేక రైతులు నష్టపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని మాజీమంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్ హెచ్చరించారు. రైతులు ఆందోళనలు చేస్తుంటే యూరియా సరఫరా చేయడంపై దృష్టి సారించకుండా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఇసుకలో యూరియా కలుపుకుని చల్లాలని అవగాహన లేకుండా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. మరి అన్నంలో కూడా ఇసుక కలుపుకుని తింటారా అని ప్రశ్నించారు. రైతుల విషయంలో ఒక్కో మంత్రి ఒకలా మాట్లాడటం బాధాకరమన్నారు. కాళేళ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు, రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ బుధవారం మహబూబ్‌నగర్ మండలం కోడూరు-అప్పాయిపల్లి చౌరస్తాలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సగౌడ్ మాట్లాడుతూ.. రైతులకు ఎన్ని ఎకరాలున్నా ఒకటి, రెండు బస్తాల యూరి యా ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. సకాలంలో యూరియా చల్లకపోతే దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఎకరాకు 40 బస్తాల వరి పండేచోట 20 బస్తాలు పండితే రైతులకు పె ట్టుబడి కూడా రాదన్నారు. వస్తున్న యూరియా బస్తాలకన్నా మూ డు, నాలుగు రెట్లు రైతులు అదనంగా ఉంటే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతున్న ప్రాంతానికి కొద్దిదూరంలోనే సీఎం ప్రోగ్రాం ఉందని, సీఎం వస్తున్నారన్న భయంతోనైనా అధికార యంత్రాంగం యూరియా కొరత లేకుండా చూస్తుందని భావించామని, కానీ అలాంటి పరిస్థితి జిల్లాలో ఎక్కడా కనిపించలేదన్నారు. రైతులు నష్టపోతే ఈ జిల్లానుంచే ఉద్యమం ప్రారంభం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్, దేవేందర్‌రెడ్డి, ఆంజనేయులు, సుధాశ్రీ పాల్గొన్నారు.