అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:33 PM
అయిజ కేంద్రంగా జిల్లాలో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు కోరారు.
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు అయిజ అఖిలపక్షం వినతి
గద్వాల టౌన్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజ నలో అయిజ కేంద్రంగా జిల్లాలో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు కోరారు. గతంలో ఉన్న విధంగానే గద్వాల కేంద్రంగా కొత్త లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి, డీలిమిటేషన్ కమిటీకి సిఫార్సు చేయాలన్నారు. సోమవారం పట్టణంలోని డీకే బంగ్లాలో బీ జేపీ, బీఆర్‌ఎస్, ఇతర జేఏసీ నాయకులు మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యురాలు డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బం గా మాట్లాడిన అఖిలపక్ష కమిటీ నాయకులు రామచంద్రారెడ్డి, అయిజ శాసనసభ నియోజక వర్గం ఏర్పాటు కోసం గతంలోనే ప్రతిపాదనలు ఉన్నా కార్యరూపం దాల్చలేదన్నారు. 1950వ దశకంలో లోక్‌సభ నియోజకవర్గంగా ఉన్న గ ద్వాలను రాజకీయ కారణాలతో మార్చిన విషయాన్ని డీకే అరుణ దృష్టికి తెచ్చారు. 2027లో గా శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పున ర్విభజన జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి సముచిత రాజకీయ ప్రాధాన్యత లభించేలా దృష్టి సారించాలని కోరారు. కాగా, ఈ సంద ర్బంగా అఖిలపక్షం నాయకులతో మాట్లాడిన ఎంపీ డీకే అరుణ, జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడవ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉందని, అందులో తొలిప్రాధాన్యత అయిజకు ఉంటుందన్నారు. ఈవిషయం గతంలోనే తెరపైకి వచ్చినా కొన్ని అనివార్య కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదని, ఈసారి తప్పకుండా అయిజకు న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చినవారిలో పార్టీలు, జేఏసీకి చెందిన నాయకులు రామాంజనేయులు, నాగర్ దొడ్డి వెంకట్రాములు, ఆంజనేయులు, జగపతి రెడ్డి, ఎండీ తాహేర్, కురువ పల్లయ్య, రంగు అశోక్, మహేష్‌బాబు, కిరణ్, శ్రీనివాసులు, రా ఘవేంద్రరెడ్డి, శరణప్ప, పులికల్ రామాంజనే యులు, నేష బసవరాజు, తోక నాగన్న తదితరులు ఉన్నారు.