Share News

అటవీ అధికారిపై చర్యలు తీసుకోరా?

ABN , Publish Date - Mar 16 , 2025 | 11:16 PM

రైతులు చిన్నపాటి చెట్లను నరికి పొలం సాగు చేసుకున్నారని పలువురు రైతులను జైలుకు పంపించిన అటవీ అధికారులు..

 అటవీ అధికారిపై చర్యలు తీసుకోరా?
జూలపల్లి అడవిలో చెట్లు నరికి మొదళ్లను కాల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

- జూలపల్లి అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌ బృందం

మహమ్మదాబాద్‌ మార్చి 16 (ఆంధ్రజ్యోతి ) : రైతులు చిన్నపాటి చెట్లను నరికి పొలం సాగు చేసుకున్నారని పలువురు రైతులను జైలుకు పంపించిన అటవీ అధికారులు.. ఆ శాఖలో పనిచేస్తున అధికారి 40 లక్షల విలువచేసే కలపను అమ్ముకుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్‌, జిల్లా కార్యదర్శి ఎ.రాములు అన్నా రు. జూలపల్లి అటవీ ప్రాంతంలోని నీలగిరి చెట్లు నరికి ఆనవాళ్లు లేకుం డా చేసి పెట్రోల్‌ పోసి తగుల పెట్టిన ప్రాంతాన్ని వారు సీపీఎం బృందం సభ్యులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకోసం ప్రభు త్వాలు వేల కోట్లు ఖర్చుచేసి మొక్కలు నాటుతుంటే వాటిని కాపాడాల్సిన అటవీ శాఖాధికారులు ఏపుగా పెరిగిన చెట్లను నరికి అమ్ముకుంటే ఉన్నతాఽ దికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సొంత లాభం కోసం అడవిని ఆనవాళ్లు లేకుండా చేసిన ఘనుడిపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు ఆ లస్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదే అడవిలో ఓ కాపరి తన మేకలకు చెట్ల కొమ్మలు మేపాడని అతని వద్ద ఓ మేకపిల్లని తీసుకున్న సెక్షన్‌ అధి కారి లక్షల రూపాయల విలువ చేసే కలపను అక్రమంగా అమ్ముకుంటే వా రం రోజులైనా పైఅధికారులు స్పందించడం లేదన్నారు. ఇందులో ఉన్నతాధికారుల పాత్ర కూడా ఏమైనా ఉందా అన్న అనుమానాలు కలుగు తున్నాయని ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌ స్పం దించి జూలపల్లి అడవి నుంచి అక్రమ కలప రవాణా చేసిన అధికారులను వెంటనే సస్పెండ్‌ చే యాలని డిమాండ్‌ చేశారు. జిల్లా నాయకులు నర్సింహులు, వై.లక్ష్మ య్య, బి.రాజు, జంబుల బాల్‌రెడ్డి, అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 11:16 PM