బొంకూరులో ఉపాధ్యాయుల కొరత
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:04 PM
బొంకూరు పాఠశాలల్లో వెంట నే ఉపాధ్యాయులను నియమించాలని విద్యా ర్థుల తల్లిదండ్రులు కోరారు.
సమస్యను విన్నవించినా పట్టించుకోని డీఈవో
పిల్లల భవిష్యత్‌పై పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
అలంపూరు చౌరస్తా, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): బొంకూరు పాఠశాలల్లో వెంట నే ఉపాధ్యాయులను నియమించాలని విద్యా ర్థుల తల్లిదండ్రులు కోరారు. ఇక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గ్రామంతో పాటు కొర్విపా డు, చంద్రశేఖర్ నగర్, శ్రీనగర్, మెన్నిపాడు, అలంపూరుచౌరస్తా ప్రాంతాల నుంచి విద్యా ర్థులు చదువుకునేందుకు వస్తారని, ప్రస్తుతం 270మంది ఉన్నారని తెలిపారు. పాఠాలు బోధించేందుకు టీచర్లు కరువయ్యారని, పదో తరగతిలో సోషల్ 1, జీవశాస్త్రం 1, గణితం 2, ఇంగ్లిష్ కోసం ఉపాధ్యాయులు కావాలని గతంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మద్ది లేటి రెండు నెలలుగా, గ్రామ మాజీ సర్పంచి శ్రీలతభాస్కర్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు. అయినా నేటివరకు ప్రయోజనంలేదని అంటు న్నారు. గ్రామానికి చెందిన ఓ విద్యావంతురాలు స్వయంగా వచ్చి సోషల్ బోధిస్తున్నారని, గణితం, జీవశాస్త్రం నేటి వరకు బోధించలేదని చెప్పారు. ఇలా ఉంటే త్వరలో నిర్వహించనున్న ఎస్‌ఏ-1 పరీక్షలు ఎలా రాయాలని పిల్లలు ప్రశ్నిస్తున్నారు.
డీఈవోకు తెలిపాం
ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన మీ టింగ్‌లో టీచర్ల కొరత విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్లాము. నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమస్య గురించి పిల్లల తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని నిలదీస్తున్నా రు. మేం ఎవరికి చెప్పుకోవాలి.
- సాయిబాబు, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు, బొంకూరు పాఠశాల