Share News

వరి కోతకు యంత్రాల కొరత

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:09 PM

మొన్నటి వరకు రైతులు యూరియా కోసం పడరాని కష్టాలు పడ్డాడు.

 వరి కోతకు యంత్రాల కొరత
కోతకు సిద్దంగా ఉన్న వరి పంట

- పడిగాపులు కాస్తున్న రైతులు

- గంటకు రూ.2500 నుంచి రూ.3300 వరకు దండుకుటున్న యంత్రాల యజమానులు

భూత్పూర్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మొన్నటి వరకు రైతులు యూరియా కోసం పడరాని కష్టాలు పడ్డాడు. ఇప్పుడు చేతికొచ్చిన పంటను తీసుకుందామంటే వరి కోత యంత్రాల కొరతతో ఎటు చూసినా రైతులకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. మండలంలోని 19 గ్రామాల్లో దాదాపు 20,632 ఎకరాల్లో ఈ సారి ఖరీఫ్‌ పంటగా వరిని రైతులు సాగు చేశారు. అయితే 51,580 టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లుగా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వరి కోతలు మొదలై దాదాపు 20 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు 30శాతమే వరికోత కోయగా, ఇంకా 70 శాతం పంట కోతకు సిద్ధంగా ఉంది. మండలంలో 159 వరి కోత యంత్రాలు ఉండగా, ప్రతీ ఊరికి దాదాపు 6 నుంచి 12 వరకు వరి కోత యంత్రాలు పంటను కోస్తున్నాయి. ఇదే అదనుగా భావిస్తున్న యంత్రాల యజమానులు గంటకు రూ.2500 నుంచి రూ.3300 వరకు రైతుల వద్ద వసూలు చేస్తున్నారు. అదే విధంగా బురదగా ఉన్న పొలాల్లో కోయడానికి చైన్‌ యంత్రాలు అయితే గంటకు రూ.2800 నుంచి రూ.3600 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:09 PM