Share News

పంట కోతకు యంత్రాల కొరత

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:16 PM

అధిక వర్షపాతం కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

పంట కోతకు యంత్రాల కొరత
అయ్యవారిపల్లి గ్రామ శివారులోని కోతకు సిద్ధంగా వరి పంట

- వర్షాల బెడదతో ఖర్చులు పైపైకి

- రైతులకు తప్పని తిప్పలు

మిడ్జిల్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : అధిక వర్షపాతం కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని పలు గ్రామాల్లో 8,177 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా, వరుస వర్షాలతో పొ లాల్లో నీరు నిలిచింది. దీంతో టూవీల్‌, ఫో ర్‌వీల్‌ డ్రైవ్‌ హార్వెస్టర్లు పొలాల్లోకి వెళ్లే పరి స్థితి లేకుండా పోయింది. ఈ కారణంగా రైతులు చైన్‌ మిషన్‌పై ఆధారపడాల్సి వ స్తోంది. కానీ ఆ యంత్రాల అద్దె మాత్రం ఆకాశాన్ని తాకుతోంది. ఇప్పటికే వరి ది గుబడి తగ్గడంతో రైతులు నిరాశలో ఉన్నా రు. పైగా హార్వెస్టర్‌ దొరకక.. ఒక వేళ దొరి కినా గంటకు రూ.4 వేల కిరాయి చెప్పడం తో పెట్టుబడి కన్నా నష్టమే ఎక్కువయ్యే ప రిస్థితి నెలకొంది. మళ్లీ వర్షం పడితే పంట తడిసిపోతోందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:16 PM