కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:19 PM
వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి మాజీ సర్పంచు గంగన్న అన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్/కోయిలకొండ/ గండీడ్/ దేవరకద్ర, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి మాజీ సర్పంచు గంగన్న అన్నారు. శుక్రవారం మండలంలోని మణికొండలో ఐకేపీ సీసీ రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, మాట్లాడారు. గ్రామ కార్యదర్శి రఘుపతిరెడ్డి, ఏఈవో అనీఫ్, నాయకు లు చంద్రశేఖర్, రాజప్ప, బస్వరాజ్ పాల్గొన్నారు. కోయిలకొండ మండలం పారుపల్లి, అనంతాపూర్, చంద్రాసుపల్లి, కొతలాబాద్ గ్రామాల్లో ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఏవో యామారెడ్డి శుక్రవారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సిం గిల్ విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విద్యాసాగర్‌గౌడ్, నాయకులు సత్యపాల్‌రెడ్డి, రవి నాయక్ పాల్గొన్నారు. గండీడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మినారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఎంపీడీవో మంజుల, ఫిషరీస్ ఏడీ రాధారోహిని, ఏవో రాధమ్మ, ఏఈవో శివలీల, సీఈవో ఆశన్న, డైరెక్టర్ బాలస్వామి, దిగంబర్‌రావు పంచాయతీ కార్యదర్శులు వెంకటేష్, సంజీవరెడ్డి పాల్గొన్నారు. దేవరకద్ర మండలం గద్దెగూడెంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అంజి ల్‌రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.