పేరుకే కొనుగోలు కేంద్రాలు
ABN , Publish Date - Apr 15 , 2025 | 10:51 PM
ధాన్యం కేంద్రాలు ప్రారంభించిన గంటలకే మూత పడ్డాయి.

- ప్రారంభించారు.. మూసివేశారు
- కొనుగోలు చేయకపోవడంతో తడిసిన ధాన్యం
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
కోయిలకొండ, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి) : ధాన్యం కేంద్రాలు ప్రారంభించిన గంటలకే మూత పడ్డాయి. అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ఫొటోలు తీసుకొని వెళ్లారు.. తప్ప ఇటప్పటికీ కిలో ధాన్యం కూడా కొనలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలో ఇప్పటి వరకు ఐకేపీ ద్వారా 8, సింగిల్‌విండో ద్వారా 8 మొత్తం 16 కొనుగోలు కేంద్రాలు ప్రారంభినా ఇప్పటికీ ధాన్యం కొనలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట రోడ్లపై ఆరబెట్టగా.. వర్షానికి ధాన్యం కొట్టుకుపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఆయా గ్రామాల్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు తాళం వేసి ఉన్నాయని, అధికారులకు ఫోన్ చేసిన ఎత్తడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పంటలో లాభం లేకపోయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో బోనస్ వస్తుందన్న ఆశతో ఉన్నామని, అధికారుల నిర్లక్ష్యంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.