Share News

భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కల్యాణోత్సవం

ABN , Publish Date - Mar 14 , 2025 | 11:23 PM

మండలంలోని కానాయపల్లి గ్రామ బస్టాండ్‌ సమీపంలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వ తుల కల్యాణోత్సవం భక్తిశ్రద్ధల తో శుక్రవారం నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కల్యాణోత్సవం
శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహిస్తున్న భక్తులు

కొత్తకోట, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కానాయపల్లి గ్రామ బస్టాండ్‌ సమీపంలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో శివపార్వ తుల కల్యాణోత్సవం భక్తిశ్రద్ధల తో శుక్రవారం నిర్వహించారు. ప్రతీ పౌర్ణమి సందర్భంగా శి వాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయంలోని కోటి లింగేశ్వరుడికి ఏకాదశ రుద్రాభి షేకం పూజలు నిర్వహించారు. అనంతరం ఆ లయ ప్రాంగణంలో శివపార్వతుల ఉత్సవ విగ్ర హాలకు కల్యాణోత్సవం, ఉమామహేశ్వర వ్ర తాలు నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భ క్తులకు ఆలయ ప్రధాన కార్యదర్శి శేఖరయ్య, వి శ్వనాథం అన్నదానం చేశారు.

Updated Date - Mar 14 , 2025 | 11:23 PM