Share News

ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , Publish Date - Oct 03 , 2025 | 11:09 PM

జోగుళాంబ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.

 ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
అలంపూరులో నదీ హారతి నిర్వహిస్తున్న అర్చకులు

- కనుల పండువగా నదీహారతి, తెప్పోత్సవం

అలంపూర్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఉత్సవాల చివరి రోజు ఉదయం శమీ పూజ చేసి ఉత్సవ మూర్తులను రథోత్సవంలో ఉంచి పుర వీధు ల వెంట ఊరేగింపు చేశారు. అనంతరం మహా పూర్ణాహుతి, అవభృత స్నపనం చేసి తుంగభద్ర పుష్కర ఘాట్‌ నందు జోగుళాం బ బాల బ్రహ్మేశ్వర స్వామికి చక్రస్నానం జరిపించారు. స్వామి అమ్మవారి ఉత్సవ వి గ్రహాలకు ఆలయ కమిటీ సభ్యులు, ఈవో దీప్తి రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితుల మం త్రోచ్ఛారణల మధ్య పూజలు చేసి నదిలో చ క్రస్నానం నిర్వహించారు.

నదీహారతి, తెప్పోత్సవం..

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సా యంత్రం నదీ పుష్కర ఘాట్లో అశేష జనవాహిని మధ్య కన్నుల పండువగా నదీహారతి, తెప్పోత్సవం ఆలయ అధికారులు నిర్వ హించారు. నదీమతల్లికి హారతు లు ఇచ్చి హంసవాహనం లో ఉత్సవ మూర్తులతో నదిలో విహారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయుడు, గద్వాల సంస్థాన వార సుడు కృష్ణ రాంభూపాల్‌ అమ్మవారి ఆల య ప్రాంగణంలో ధ్వజావరోహణం నిర్వ హించి ఉత్సవాలకు స్వస్తి పలికారు.

తెప్పోత్సవంలో విహరించిన జములమ్మ

గద్వాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : జములమ్మ ఆలయంలో దసరా వేడు కలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు గురువారం నిజరూప దర్శనంలో అ మ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం అమ్మవారికి పల్లకిసేవ నిర్వ హించి అనంతరం శమీ పూజ నిర్వహించారు. మొదటిసారి జములమ్మ రిజ ర్వాయర్‌లో అమ్మవారు విహరించేందుకు ప్రత్యేకంగా పవర్‌బోట్‌ను సిద్ధం చేసి, దానిని పూలతో, విద్యుత్‌ దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు హాజరయ్యారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరించిన బోట్‌లోకి చేర్చారు. రిజర్వాయర్‌లో అమ్మవారు తెప్పోత్సవంలో విహరిస్తుండగా భక్తులు పెద్ద ఎత్తున తరించారు. ఆలయ చైర్మన్‌ వెంకట్రాములు, ఈఓ పురేందర్‌కుమార్‌, డైరెక్టర్లు మంగలి వీరేష్‌, కొండపల్లి మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2025 | 11:09 PM