నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:21 PM
దుర్గాదేవీ శరన్నవరాత్రి ఉత్సవా లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
- మండపాలను సిద్ధం చేస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : దుర్గాదేవీ శరన్నవరాత్రి ఉత్సవా లు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా దుర్గాదేవీ ఆలయా లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో ని ర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయ దశ మికి ముందు తొమ్మిది రోజుల పాటు అమ్మ వారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. ప్రతీ అవతారానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతీ దేవి పూజ వెనక ఆధ్యాత్మిక విశిష్టత ఉంటుంది. శుద్ధ పాడ్యమి 22వ తేదీ సోమవారం నుంచి 3వ తేదీ విజయ దశమి వరకు నవరాత్రి ఉత్సవా లు కొనసాగనుండగా, అక్టోబరు 3న శోభాయాత్రను నిర్వహించనున్నారు.
తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాలు
మొదటి రోజు సోమవారం అమ్మవారు స్వర్ణ కవచాలంకృత ఉమాదేవీగా, 23న అన్నపూర్ణ దేవీగా, 24న గాయత్రి దేవీగా, 25న వైష్ణవి దేవీగా, 26న వనదుర్గాదేవీగా, 27న బాలత్రిపురా సుందరి దేవీగా, 28 మహాలక్ష్మీదేవీగా, 29న సర స్వతీ దేవీగా, 30న మహిషాసుర మర్దినిదేవీగా, అక్టోబరు 1న కనకదుర్గాదేవీగా, 2న లలితాత్రిపు రాసుందరి దేవీగా, 3న వాసవీ కన్యకా పరమే శ్వరి దేవీ రూపంలో అమ్మవారిని అలంకరిస్తా రు. కాగా ఈనెల 28న వాసవీ కన్యకా పరమే శ్వరి ఆలయంలో అమ్మవారిని రూ రూ.7 కోట్ల 77 లక్షల 77 వేల కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి రూపంలో అలంకరించనున్నారు.
పటిష్ట పోలీసు భద్రత
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద, దుర్గామాత మండపాల వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. నేటి నుంచి మరింత భద్రతను పెంచనున్నారు. శోభాయా త్ర రోజు ప్రత్యేక బలగాలతో బందోబస్తు కల్పించనున్నారు.