ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:36 PM
ఐదోశక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబాదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యా యి.
- శైలపుత్రీదేవి అలంకరణలో జోగుళాంబాదేవి
- తొలిరోజు ధ్వజారోహణ, అంకురార్పణ
అలంపూర్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఐదోశక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబాదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యా యి. ఇందులో భాగంగా మొదటి రోజు జోగుళాంబ అమ్మ వారు శైలపుత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చా రు. హిమవంతుడి పుత్రికగా, దుర్గమ్మ తొలి రూపంగా శైలపుత్రీ దేవిని కొలుస్తారు. ఆలయ ఈఓ దీప్తి, చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జోగుళాంబదేవి ఆల యంలో అనతి స్వీకరణ, యాగశాల ప్రవేశం, గణపతిపూజ, కలశస్థాపన వంటి పూజలు నిర్వహించారు. సాయం త్రం వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య ధ్వజారోహణంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి మండల దీక్షలు, నవరాత్రుల దీక్షలను స్వీకరించారు. అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు.