సర్వీస్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి
ABN , Publish Date - May 29 , 2025 | 11:09 PM
పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క సర్వీస్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు.
- ఎస్పీ యోగేష్ గౌతమ్
నారాయణపేట, మే 29 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క సర్వీస్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం డీపీవో కార్యాలయానికి వెళ్లిన ఆయన ప్రత్యక్షంగా పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క సర్వీస్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేస్తున్నారనే అంశంపై ఆరా తీశారు. నమోదు చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పీపీటీ ద్వారా ఉద్యోగి సర్వీస్ సమాచారాన్ని వివరించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రియాజ్ హుల్‌హక్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.