సేవా పక్షోత్సవాలు నిర్వహించాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:10 PM
బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈనెల 17 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించే సేవా పక్షోత్సవాలు బూత్ స్థాయిలో నిర్వహించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి పిలునిచ్చారు.
- బీజేపీ జాతీయ కార్వవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈనెల 17 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించే సేవా పక్షోత్సవాలు బూత్ స్థాయిలో నిర్వహించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి పిలునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కన్వీనర్ కొత్తకోట కిరణ్‌రెకుమార్‌రెడ్డి అధ్యతన జరిగిన కార్యవర్గ సమావేశానికి ఆమె పాల్గొని మాట్లాడారు. సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినం, ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా సేవా పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించాలన్నారు. జిల్లా అఽధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, సేవ పక్షం జిల్లా కో కన్వీనర్ రాజుగౌడ, మల్లేష్, సాయితిరెడ్డి, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి, గంగన్న, లక్ష్మి, సతీష్‌కుమార్ పాల్గొన్నారు.