Share News

మహిళా న్యాయవాదులకు ప్రత్యేక గది

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:35 PM

జిల్లా మహిళా న్యాయవాదులు తమ పదేళ్ల ప్ర యత్నాన్ని సాధించుకున్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో తగు సౌకర్యాలతో ప్రత్యేక గది ఉండాలన్న వారి కోరిక జిల్లా ప్ర ధాన న్యాయాధికారి ప్రేమలత సమక్షంలో నెరవేరింది.

మహిళా న్యాయవాదులకు ప్రత్యేక గది
గదిని ప్రారంభిస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రేమలత

గద్వాల క్రైం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా మహిళా న్యాయవాదులు తమ పదేళ్ల ప్ర యత్నాన్ని సాధించుకున్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సముదాయంలో తగు సౌకర్యాలతో ప్రత్యేక గది ఉండాలన్న వారి కోరిక జిల్లా ప్ర ధాన న్యాయాధికారి ప్రేమలత సమక్షంలో నెరవేరింది. ప్రిన్సిపల్‌ సివిల్‌ న్యాయాధికారి కోర్టు భవనంపైన మహిళా న్యాయవాదుల కోసం కేటాయించిన ప్రత్యేక బార్‌రూమ్‌ను శనివారం జిల్లా ప్రధాన న్యాయాధికారి ప్రారంభించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కావ లి నర్సింహులు, జయసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన న్యాయా ధికారి మాట్లాడుతూ.. తాను ఇంతవరకు పనిచేసిన చోట ఎక్కడ కూడా మహిళల కోసం ప్రత్యే క బార్‌ గది ఉండటాన్ని చూడలేదని, ఈ విషయంలో చొరవ తీసుకున్న గద్వాల న్యాయవాదుల సంఘాన్ని ఆమె అభినందించారు. కార్యక్రమంలో న్యాయాధికారులు రవికుమార్‌, శ్రీనివా స్‌, పూజిత, ఉదయ్‌నాయక్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2025 | 11:35 PM