క్రీడలతో ఆత్మవిశ్వాసం
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:25 PM
క్రీడలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవరు తుందని, ఓర్పుతో జ ట్టుగా పనిచేయడం అలవాటవుతుందని, తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి అన్నారు.
- మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి
- జోనల్ లెవల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రారంభం
జడ్చర్ల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : క్రీడలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవరు తుందని, ఓర్పుతో జ ట్టుగా పనిచేయడం అలవాటవుతుందని, తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మహబూబ్‌నగర్ ఎస్పీ జానకి అన్నారు. జడ్చర్ల మండలంలోని చిట్ట బోయిన్‌పల్లి సాంఘిక, సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ సోషల్‌వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ సొసైటీ 11వ జోనల్ లెవల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌ను గురువారం ఆమె క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తాను కూడా గురుకుల పాఠశాలలోనే చదువుకున్నా నని, హ్యాండ్‌బాల్ ఆడేదానినని గుర్తుచేసుకున్నారు. విద్యార్థినులు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని సూచించారు. ఈ క్రీడాత్సోవంలో మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలలోని వివిధ సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థినులు 935 మంది పాల్గొన్నారు. వారికి అథ్లెటిక్స్‌తో పాటు కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్, వాలీ బాల్, టెన్నికాయిట్‌తో పాటు, చెస్, క్యారమ్స్ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అనిత, జోనల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ షంషేర్‌అలీ, పీఈటీ శరణ్య, ఉపాధ్యాయులు రాజేశ్వరి, భవాని, శ్రీదేవిలతో పాటు పలువురు పాల్గొన్నారు. చిట్టబోయిన్‌పల్లి సాంఘిక, సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించి మాట్లాడుతున్న ఎస్పీ జానకి