Share News

లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 21 , 2025 | 11:05 PM

రాజీవ్‌ యువ వికాసం లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో రాజీవ్‌ యు వ వికాసం లబ్ధిదారుల ఎంపిక పురోగతిపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు.

లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలి
అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, మే 21 (ఆంధ్రజ్యోతి) : రాజీవ్‌ యువ వికాసం లబ్ధి దారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్‌ తన ఛాంబర్‌లో రాజీవ్‌ యు వ వికాసం లబ్ధిదారుల ఎంపిక పురోగతిపై అధి కారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాకు రూ.126.34 కోట్లు సబ్సిడీ రూపంలో మంజూరు కాగా 28,110 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో వనపర్తి నియోజకవర్గానికి రూ.72.03 కోట్లు మంజూరు కాగా 15,388 దరఖాస్తులు వ చ్చాయన్నారు. మక్తల్‌ నియోజకవర్గానికి రూ.14 కోట్లు మంజూరు కాగా 3,114 దరఖాస్తులు, దే వరకద్ర నియోజకవర్గానికి రూ.9.24కోట్లు మం జూరు కాగా 4,334 మంది దరఖాస్తులు, కొ ల్లాపూర్‌ నియోజకవర్గానికి రూ.22.19 కోట్లు మంజూరు చేయగా 5,274 దరఖాస్తులు వ చ్చాయని వివరించారు.

రోడ్డు విస్తరణ పనులు వేగవంతం

జిల్లాలో రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్‌లో వనపర్తి పట్టణం నుంచి వెళ్లే పాన్‌గల్‌, కొత్తకోట, పెబ్బేరు రోడ్డు విస్తరణపై అటవీశాఖ, రెవెన్యూ, మునిసిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్త రణలో అడ్డుగా ఉన్న దుకాణ, ఇళ్ల యజమా నులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ వేగవం తం చేయాలని సూచించారు. ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇచ్చి భవనాల కూల్చి వేతలు ప్రారంభించాలని తెలిపారు. పెబ్బేరు రోడ్డు, ఎకో పార్కు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, స్పోర్ట్స్‌ స్కూ ల్‌కు సంబంధించిన అటవీ భూముల విష యంలో అధికారులతో కలెక్టర్‌ చర్చించారు. సమావేశంలో డీఎఫ్‌వో ప్రసాద్‌ రెడ్డి, ఆర్‌ఎఫ్‌వో అరవింద్‌రెడ్డి, ఆర్టీవో సుబ్రహ్మణ్యం, తహసీ ల్దార్‌ రమేష్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ వెంక టేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 11:05 PM