Share News

జాతీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:21 PM

జాతీయ బాలల వై జ్ఞానిక ప్రదర్శనకు నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండల కేంద్రం లోని ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం వేంరెడ్డి నరేందర్‌రెడ్డి శనివారం తెలిపారు.

జాతీయ బాలల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక
సోలార్‌తో తయారు చేసిన సైకిల్‌, పక్కన విద్యార్థి

బల్మూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : జాతీయ బాలల వై జ్ఞానిక ప్రదర్శనకు నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండల కేంద్రం లోని ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్‌ఎం వేంరెడ్డి నరేందర్‌రెడ్డి శనివారం తెలిపారు. పదవ తరగతి విద్యార్థులు జగ న్‌చంద్ర, వినయ్‌ సోలార్‌తో నడిచే సైకిల్‌, ఇతర పరికరాలను నా గర్‌కర్నూల్‌లో జరిగిన ప్రదర్శనలో ఎంపికై రాష్ట్రస్థాయిలో ప్రదర్శిం చారని తెలిపారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భూపాల్‌లో ఈనెల 18నుం చి 23వరకు జరిగే అంతర్జాతీయ బాలలవైజ్ఞానిక ప్రదర్శనలో వీరు ప్రతిభ కనబరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 15 , 2025 | 11:21 PM