Share News

1,249 మంది పోలీసులతో బందోబస్తు

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:00 PM

స్థానిక సం స్థల ఎన్నికల్లో భాగంగా మ హబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి మూడో విడత కోసం 1,249 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎ స్పీ జానకి తెలిపారు. మంగళవారం ఆమె జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

1,249 మంది పోలీసులతో బందోబస్తు
మాట్లాడుతున్న ఎస్పీ

ఎస్పీ జానకి

జడ్చర్ల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సం స్థల ఎన్నికల్లో భాగంగా మ హబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి మూడో విడత కోసం 1,249 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎ స్పీ జానకి తెలిపారు. మంగళవారం ఆమె జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లాలో 145 గ్రామాల్లోని 212 పోలింగ్‌ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓటర్లు ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు అధికారి, సిబ్బంది నిష్పక్షపాతంగా, బాఽధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తిన సందర్భంలో తక్షణమే నియంత్రణ చర్యలు చేపట్టాలని, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో 1,249 మంది పోలీసుల్లో ఒక ఎస్పీ, ఇద్దరు అదనపు ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 29 మంది ఇన్‌స్పెక్టర్లు, 66 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 1,144 మంది సిబ్బంది పాల్గొంటున్నారని వివరించారు. జడ్చర్ల, బాలానగర్‌, భూత్పురు, అడ్డాకుల, మూసాపేట మండలాల్లో జిల్లాలోని 212 పోలింగ్‌ కేంద్రాల్లో 1,254 పోలింగ్‌ స్టేషన్‌లు ఉన్నాయన్నారు. 44 సమస్యాత్మక గ్రామాలు ఉండగా, అందులో 52 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 394 పోలింగ్‌ స్టేషన్‌లు ఉన్నాయని తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా 44 రూట్‌ మొబైల్స్‌, 15 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు, 5 స్ర్టైకింగ్‌ ఫోర్స్‌, మరో 5 స్పెషల్‌ స్ర్టైకింగ్‌ ఫోర్స్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Updated Date - Dec 16 , 2025 | 11:00 PM