నైపుణ్యాలు గుర్తించేందుకే సైన్స్‌ఫేర్
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:15 PM
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్ధుల్లో నైపుణ్యాలు గుర్తించేందుకే సైన్స్‌ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి అన్నారు.
- ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, సెపెం్టబరు 15 (ఆంధ్రజ్యోతి) : నేటి పోటీ ప్రపంచంలో విద్యార్ధుల్లో నైపుణ్యాలు గుర్తించేందుకే సైన్స్‌ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతోందని ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి అన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీయర్స్ డేను జయప్రకాష్ నారాయన్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్యర్యంలో జిల్లా కేంద్రంలోని స్టేడీయం మైదానంలో గల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన ఇంజనీరింగ్, పాలిటెక్నిక్‌లోని వివిధ విభాగాల విద్యార్థులు సుమారు 150 రకాల ఎగ్జిబిట్‌లను ప్రదర్శించగా, పలు కళాశాల, పాఠశాల విద్యార్ధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేపీఎన్‌సీఈ నుంచి మోక్షగుండం విశేశ్వరయ్య లాంటి ఇంజనీయర్స్ తయారు కావాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ కళాశాలకు చెందిన విద్యార్థులు 150పైగా ప్రదర్శనలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇందుకు 400 మంది విద్యార్థులు ఈ ప్రదర్శనలు తయారు చేశారన్నారు. అనంతరం 15 మంది ఇంజనీయర్లను సన్మానించారు. కళాశాల వైస్ చైర్మన్ భాస్కర్, కార్యదర్శి వెంకటరామారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా.వీఈ చంద్రశేఖర్, పరీక్ష విభాగం అధికారి సందీప్‌కుమార్ పాల్గొన్నారు.