బడి దూరమనిపదోన్నతికి కొర్రీ
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:48 PM
రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు క ల్పించింది.
- పదోన్నతులకు మొగ్గుచూపని జీహెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు
- ఉపాధ్యాయులు లేక విద్యార్థుల చదువుపై ప్రభావం
వనపర్తి విద్యా విభాగం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులు క ల్పించింది. దీంతో ఎప్పుడు పదోన్నతులు కల్పిస్తారా అని ఎదురుచూస్తున్న కొందరు ఉపాధ్యాయులకు ఎంతగానో ఊరట కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులుగా, ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించింది. జిల్లాలో మెజారిటీ ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలలో చేరగా, మరి కొం తమంది ఉపాధ్యాయులు పదోన్నతులు తిరస్కరించి, పాత క్యాడర్ లోనే కొనసాగుతున్నారు. ఫలితంగా సీనియారిటీలో తరువాత ఉన్నవారు నష్టపోగా, పలు పోస్టులు ఖాళీగానే మిగిలిపోయాయి. 8 మంది జీహెచ్‌ఎంలు, 8 మంది ఉపాధ్యాయులు పదోన్న తులకు దూరంగా ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా అర్హులైన ఎస్జీటీల కు, స్కూల్ అసిస్టెంట్‌గా 76 మందికి ఆ యా సబ్జెక్టుల్లో పదోన్నతులు లభించాయి. వీరిలో 68 మంది మాత్రమే వారికి కేటా యించిన పాఠశాలలో చేరారు. మిగిలిన 8 మంది పాత క్యాడర్‌లోనే ఉండిపోయారు. పీఎస్ హెచ్‌ఎం 4 (చిన్నంబావి మండలం, దగడ, అయ్యవారిపల్లి, అమరచింత డీఎంఆర్‌ఎం, అమరచింత మండల ఈర్లదిన్నె) ఖా ళీగా ఉన్నాయి. బయోసైన్స్ 2 (చిన్నంబావి మండలం బెక్కెం, శ్రీరంగాపురం మండలం వెంకటాపూరం) ఖాళీగా ఉన్నాయి. సోషల్- 1 (ఘణపూర్ మండలం మల్కాపూర్) ఖాళీగా ఉంది. ఫిజిక్స్ 1 ( చిన్నంబావి మండలం వె ల్టూర్) మాథ్స్ 1 (ఆత్మకూరు గర్ల్స్ ) పోస్టు ఖాళీగా ఉంది.
మల్టీ జోనల్-2 పరిఽధిలో జిల్లాకు 23 మంది ప్రధానోపాధ్యాయులకు కేటాయించగా, వీరిలో 15 మంది మాత్రమే వారికి కేటాయిచిన పాఠశాలలో చేరారు. మిగిలిన ఎనిమిది మంది అమరచింత (బాలికల పాఠశాల), బుద్ధారం, రేవల్లి, బొల్లారం, వీపనగండ్ల (బాలికలు), తూముకుంట, చిన్నంబా వి మండలం అయ్యవారిపల్లి ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయులు చేరలేదు.
కారణాలు అనేకం...
1. మల్టిజోనల్ పరిధిలో ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారు దూర ప్రాంతాలకు కేటాయించారు అనే సాకుతో ఇక్కడికి రాలేదు.
2. పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యా యులు చేరకపోవడంతో జిల్లాలో 8 పాఠశాలలో జిహెచ్‌ఎంలు లేక ఖాళీగా ఉన్నా యి. ఇతర జిల్లాల నుంచి కేటాయించిన వారే తిరస్కరించిన వారిలో ఉన్నారు.
3. ఉన్నత పాఠశాలలో పనిభారం, పదోన్నతి కల్పించిన బడులు దూరభారం కావడంతో చేరలేదు.
4. బోధనలో కొత్త సంస్కరణలు, వృత్తి నైపుణ్యాలను ప్రభుత్వం పెంచుతున్న, ఉపాధ్యాయులు వివిధ కారణాలతో పదోన్న తులకు దూరంగా ఉండటంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడుతుంది.