పాఠశాల ఆటో బోల్తా
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:18 PM
20 మందితో వెళ్తున్న స్కూల్ ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలైన సంఘటన శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో చోటు చేసుకున్నది.
- స్వల్ప గాయాలతో బయటపడ్డ విద్యార్థులు
- అటోలో 20 మంది విద్యార్థులు
గట్టు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : 20 మందితో వెళ్తున్న స్కూల్ ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలైన సంఘటన శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో చోటు చేసుకున్నది. ఈ సం ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉ న్నాయి. గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రా మంలో నిర్వహిస్తున్న జ్ఞానసరస్వతి స్కూల్ కు టాటాఏసీ ఆటో సల్కాపురం నుంచి ని త్యం పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్తోంది. ఈ క్రమంలో శుక్రవారం అటో విద్యార్థులను తీసుకొని వెళ్తుండగా సల్కాపురం స మీపంలో అదుపు తప్పి పక్కనే ఉన్న పొ లంలోకి దూసుకెళ్లింది. దీంతో విద్యార్థులు ఆం దోళనకు గురయ్యారు. సంఘటన జరిగిన సమయంలో స్కూల్ ఆటోలో 20 మం ది ఉన్నారు. విషయం తెలియడంతో విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెంది హూటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని తమ పిల్లలను అక్కున చేర్చుకున్నా రు. సంఘటనలో రెండవ తరగతి చదువుతున్న శివాని అనే ఏడు సంవత్సరాల విద్యార్థినికి గాయాలయ్యాయి. మిగతా వారు స్వ ల్ప గాయాలతో బయటపడ్డారు. ఆటో పొ లాల్లోకి దూసుకెళ్లిన సమయంలో ఆటో నె మ్మదిగా పోవడంతో పెను ప్రమాదం త ప్పిందని స్థానికులు తెలిపారు. ఈ సంఘ టనపై సల్కాపురం గ్రామానికి చెందిన బోయ మౌలాలి ఆటో డ్రైవర్ వీరేష్ అజాగ్రత్తగా నడపడం వల్ల బోల్తా పడిందని, ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కేటీ మల్లేష్ తెలిపారు. జ్ఞాన సరస్వతి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ గద్వాల నియోజకవర్గ అభ్య ర్థి ఎస్ రాజు శుక్రవారం అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణకు ఫిర్యాదు చేశారు.