Share News

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:35 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్‌, సంధ్యారాణి అన్నారు.

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సమావేశంలో మాట్లాడుతున్న వేణుగౌడ్‌

కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ పరిశీలకుడు వేణుగౌడ్‌

నారాయణపేట , ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలనలో ఇచ్చిన హామీలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని టీపీసీసీ పరిశీలకులు వేణుగౌడ్‌, సంధ్యారాణి అన్నారు. మంగళవారం నారాయణపేట సీవీఆర్‌ బంగ్లాలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వేణుగౌడ్‌, సంధ్యారాణి మాట్లాడుతూ జై బాపు.. జై భీమ్‌.. జై సంవిధాన్‌ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో త్వరగా పూర్తి చే య్యలన్నారు. పార్టీని సంస్థాగతంగా పటిష్ఠం చేసేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కొత్త కమిటీలు వేయాలన్నారు. మే 20 వరకు కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. ఇదివరకు నామినేటెడ్‌ పద్ధతిలో పార్టీ అధ్యక్షుల నియామకం జరిగిందని, కానీ ఇప్పుడు పార్టీని బలోపేతం చేస్తూ, కష్టపడిన వారు పదవులకు పోటీ చేసేలా అవకాశం కల్పిస్తుందన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి కుంభం శివకుమార్‌రెడి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పట్టణ, మండల అధ్యక్షులు కష్టపడి పని చేశారని, వారిని పక్కన పెట్టకుండా మళ్లీ అవకాశం ఇవ్వాలన్నారు. డీసీసీ అధ్యక్షు డు ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, బాలకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, కొత్తకోట సిద్దార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 11:35 PM