Share News

ఎస్సీ కులపత్రాలు జారీ చేయాలి

ABN , Publish Date - Nov 12 , 2025 | 11:32 PM

మా దాసి కురవ, మాదారి కురవలకు వెంటనే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని డి మాండ్‌ చేస్తూ బుధవారం ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.

 ఎస్సీ కులపత్రాలు జారీ చేయాలి
ఆర్డీవోకు వినతి పత్రం అందిస్తున్న మాదాసి కురువలు

- ఆర్డీవో కార్యాలయం ముందు మాదాసి కురవల నిరసన

గద్వాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మా దాసి కురవ, మాదారి కురవలకు వెంటనే ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని డి మాండ్‌ చేస్తూ బుధవారం ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా వారు ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. కురువ అనే పదం మాదాసి కురువ, మాదారి కురువలో అంతర్లీనం అయ్యిందని, ఇది ఎస్సీ వ ర్గీకరణలోకి వస్తుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో రాజ్యాంగం ద్వారా గుర్తించబడిన కులాలలో మాదాసి కుర వ కూడా ఎస్సీ జాబితాలో ఉందని వివరించారు. కురవ పేరుతో ఏ కులం లేదని కానీ మా తాతముత్తాతలు చదు వు రాని వారు కావడంతో కు రువ పేరుతో బీసీ కుల పత్రా లను రెవెన్యూ అధికారులు జారీ చేయడంతో మేము చా లా ఏళ్లుగా నష్టపోయామని వివరించారు. ఇప్పుడు ఆ తప్పును గు ర్తించి జాతీయ ఎస్సీ కమిషన్‌ వారికి మొరపెట్టుకోగా వారు తగు సిఫారసు చేస్తూ మహబూ బ్‌ నగర్‌లోని మాదాసి కురువ, మాదారి కురువలకు ఎస్సీ కుల పత్రాలు జారీ చేయాలని సూ చించిందని వివరించారు. ఈ మధ్యనే కొల్లాపురంలో సీఎం రేవంత్‌రెడ్డి కూడా కురువలకు అ న్యాయం జరిగిందని వారి పిల్లలకు సర్టిఫికెట్లు జారీ చేసి న్యాయం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ రెవెన్యూ అధికారులు సీఎం మా టకూ విలువ ఇవ్వడం లేదని, వెంటనే మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. వీరేష్‌, రాజేష్‌, భరత్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, నాగరాజు, రాముడు, మరో 50మంది పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 11:32 PM