కలెక్టరేట్‌లో సత్యసాయిబాబా శత జయంతి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:38 PM
సత్యసాయిబాబా శత జయంతి కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించగా, కలెక్టర్ విజయేందిరబోయి సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : సత్యసాయిబాబా శత జయంతి కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించగా, కలెక్టర్ విజయేందిరబోయి సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయిబాబా చూపిన సేవ, ధర్మమార్గం ఎల్లవేళలా అనుసరణీయం అన్నారు. మానవ సేవే పరమావదిగా సేవా కార్యక్రమాలు చేపట్టి విశిష్ట స్థానం సంపాదించారన్నారు. ప్రేమ ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాస్, కలెక్టరేట్ ఏవో సువర్ణరాజ్ పాల్గొన్నారు.