Share News

నల్లమలపై శాటిలైట్‌ నిఘా

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:24 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా లోని నల్లమలపై శాటిలైట్‌ నిఘా ఏర్పాటు చేశారు.

నల్లమలపై శాటిలైట్‌ నిఘా
మంటలు అదుపు చేస్తున్న అటవీ సిబ్బంది (ఫైల్‌)

- ఎక్కడ మంటలు రాజుకున్నా వెంటనే గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక

- వేసవిలో మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ లైన్‌

- 20 బ్లోయర్లతో కూడిన రెండు ప్రత్యేక బృందాలు

- అడవిలో నిప్పు పెడితే కఠిన చర్యలు

కొల్లాపూర్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా లోని నల్లమలపై శాటిలైట్‌ నిఘా ఏర్పాటు చేశారు. అడ విలో ఏపుగా పెరిగిన గడ్డికి వేసవిలో నిప్పురాజు కుంటే వెంటనే అటవీశాఖ అప్రమత్తమయ్యేలా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. కొల్లాపూర్‌ మండలంలో అమ్రాబాద్‌ పరిధిలోని నల్లమ లలో 10 రోజుల క్రితం మంటలు వ్యాపిస్తే అటవీశాఖ అధికారులు శాటిలైట్‌ ద్వారా పాయింట్లు గుర్తించి మంటలు అదుపు చే శారు. కొల్లాపూర్‌ మండలంలోని ఎర్రపెం ట, పెగ్గర్లపెంట, ఎర్రగుండం, పెద్దూటి పరిసరాల్లో ఎండుగడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో మంటలు వ్యా పించాయి. శానిలైట్‌ ద్వారా పాయింట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు వారం రోజుల పాటు బ్లోయర్‌ సాయంతో అదుపు చేశారు. మంటలను అదుపుచేసేందుకు 20బ్లోయర్‌ మిషన్లతో పాటు పది మందితో కూడిన రెండు ఫైర్‌ బృందా లు, 20 మంది బేస్‌క్యాంపు వాచర్లు అందు బా టులో ఉండేలా అధికారులు చర్యలు చేప ట్టారు. గతంలో ఏర్పాటు చేసిన ఫైర్‌ లైన్‌ ను కూడా పునరుద్ధరించారు. అటవీ ప్రాంతంలో మంటలు వ్యాపిస్తే వన్య ప్రాణులు, మూగ జీవాలు మృత్యువా త పడతాయని నిప్పు పెట్టే వారిని సీసీ కెమెరాలతో గుర్తించేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పరిసర గ్రా మాల ప్రజలు, గొర్రెల కాపరులు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:24 PM