యువతకు స్ఫూర్తి సర్దార్‌వల్లభాయ్ పటేల్
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:02 PM
యువతకు సర్దార్‌వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.
- యూనిటీ మార్చ్ ప్రారంభంలో ఎంపీ డీకే అరుణ
జడ్చర్ల, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : యువతకు సర్దార్‌వల్లభాయ్ పటేల్ స్ఫూర్తి అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా మంగళవారం జడ్చర్లలో యూనిటీ మార్చ్ ర్యాలీని ప్రారంభించారు. మినీ స్టేడియం నుంచి సిగ్నల్‌గడ్డ మీదుగా పట్టణంలోని నేతాజీచౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయంతి వేడుకల ముగింపులో భాగంగానే యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అంతకుముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. గతంలో బీఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్ దొందూ, దొందే అని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటూ ఉంటే కేంద్రం నిధులతోనే అన్నారు. ఇందిరమ్మ చీరలు కట్టుకుని ఎన్నికల్లో ఓట్లు వేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడుగుతున్నాడని, రూ.300 ముతక చీరకు ఆశపడి మహిళలు ఓట్లు వేస్తారా.? అని ప్రశ్నించారు. అదేవిధంగా అంబేడ్కర్ కళాభవన్‌లో కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసి సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంఝావర్, పద్మజారెడ్డి, బాలత్రిపురసుందరి, సాహితిరెడ్డి, బాలవర్దన్‌గౌడ్, అమర్‌నాథ్‌గౌడ్, శ్రీనాథ్, నరేశ్, గౌరీశంకర్ పాల్గొన్నారు.