సంగమేశ్వరాలయ శిఖర పూజ మహా మంగళ హారతి
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:24 PM
సంగమేశ్వర ఆలయానికి చివ రిసారి శిఖర పూజ మహా మంగళ హారతి కార్యక్రమాన్ని ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ య్య శర్మ ఆదివారం ఘనంగా నిర్వహించా రు.
కొల్లాపూర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : సంగమేశ్వర ఆలయానికి చివ రిసారి శిఖర పూజ మహా మంగళ హారతి కార్యక్రమాన్ని ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ య్య శర్మ ఆదివారం ఘనంగా నిర్వహించా రు. కృష్ణానది జలాల్లో జలాధివాసం అవు తున్న సంగమేశ్వరుడికి చివరిసారి వేద మంత్రోచ్ఛారణ మధ్య పురోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో మూడు రో జుల్లో ఆలయ శిఖరం కూడా కృష్ణానది వ రదలో పూర్తిగా నీటి ముంపునకు గురి కా నుంది. దీంతో పురోహితులు, భక్తులు చి వరిసారి ఆలయ శిఖరాన్ని దర్శించుకున్నా రు. మరో ఆరు నెలల తరువాత కృష్ణానది వరద జలాల నుంచి సంగమేశ్వరం ఆల యం బయటపడనుంది.