ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక, మట్టి
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:28 PM
ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, మట్టిని అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు.
జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్
గద్వాల క్రైం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, మట్టిని అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్యాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ గృహాల నిర్మాణం కొరకు కావలసిన ఇసుక, మట్టి లభ్యతపై కమిటీ సభ్యులతో చర్చించారు. లబ్ధిదారులకు అవసరమైన ఎనిమి ది ట్రాక్టర్ల ఇసుకను, ఎనిమిది ట్రాక్టర్ల మట్టిని అందించి పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ.100, మట్టికి రూ.400 చొప్పున వసూలు చేయాలన్నారు. వినియోగదారులు సంబంధిత తహసీల్దార్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లైతే పరిశీలించి మంజూ రు చేయాలని పరిశీలించి మంజురు చేయాలని సూచించారు. ఇసుక తవ్వకాలు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సరఫరా వ్యవ స్థను నిర్వహించాలని అధికారులను ఆదేశించా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మైన్స్ ఏడీ వెంకటరమణ, డీపీవో నాగేం ద్రం, జిల్లా అధికారులు ఉన్నారు.