సాయిబాబా జీవితం ఆదర్శం
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:35 PM
పుట్టపర్తి సాయిబాబా జీవితం మానవాళికి ఆదర్శం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ న్యూటౌన్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : పుట్టపర్తి సాయిబాబా జీవితం మానవాళికి ఆదర్శం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని వేంకటేశ్వర కాలనీలోని సాయిబాబా ఆలయంలో ఆదివారం పుట్టపర్తి సాయిబాబా శతజయంతి ఉత్సావాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కుల, మత, వర్గ విభేదాలు లేకుండా సమస్త జీవుల పట్ల కారుణ్యం చూపాలని గొప్ప సందేశం అందించారన్నారు. సాయిబాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ నాయకుడు సుధాకర్‌రెడ్డి, మునిసిపల్ మాజీ కౌన్సిలర్ వెంకటేష్, సాయిసేవా సమితి సభ్యులు మనోహర్‌రెడ్డి, హన్మంతురెడ్డి, రంగయ్య, లక్ష్మయ్య పాల్గొన్నారు. అంతకుముందు నగరంలోని జగదాంబ కాలనీలో కొలువైన సీతారామచంద్ర స్వామి ఆలయంలో డిసెంబరు 5న నిర్వహించే అయ్యప్ప స్వామి మహా పడిపూజ పోస్టర్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, గురుస్వామి శ్యాంసుందర్, గురుస్వామి నగేష్, అయ్యప్ప స్వాములు వెంకటేష్, రాకేష్, రాహు ల్, నాయకుడు సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు.